ఏసు క్రీస్తు యొక్క

శుభవార్త కేవలం

5 ప్రయత్నాలలో

1

పరలోకం ఒక ఉచిత బహుమానం.
దానిని సంపాదించడం వీలుకాదు, అర్హత పొందుటకు కూడా వీలుకాదు.

*

ఈరోజు నీ పుట్టిన రోజుగా ఊహించుకో. మీ అమ్మగారు నీకొక ఖరీదైన బహుమానం ఇచ్చి నిన్ను ఆశ్చర్యపరచింది- అదే సరికొత్త ఐఫోన్. "ఆహా! థ్యాంక్స్ అమ్మా!" అని నువ్వన్నావు. తరువాత మీ అమ్మగారికి ఇవ్వడానికి నీ జేబులోంచి కొన్ని డబ్బులు తీయడానికి ప్రయత్నించావు. నువ్వు తనకి చెల్లింపు చేస్తే, ఇక అది బహుమానంగా ఉంటుందా? అస్సలు వుండదు. అంతేకాకుండా, మీ అమ్మగారికి డబ్బులు చెల్లించడమనేది ఒక పెద్ద అవమానమే అవుతుంది.

లేదా, ఒక తండ్రి తన టీనేజి కూతురు పాఠశాలలో బాగా చదివే విధంగా ఆమెని ప్రోత్సహిద్దామనుకుంటున్నాడనుకోండి. కాబట్టి అపుడు ఆయన ఆమెతో ఇలా అంటాడు, "నువ్వు ఈ సంవత్సరంలో అన్నింటిలోనూ 'ఏ' గ్రేడు తెచ్చుకుంటే, నీకు ఈ క్రిస్మస్‌కి ఒక కారు కొనిస్తాను."

సంవత్సరం ముగిసే సరికి తను అన్ని సబ్జెక్టుల్లోనూ 'ఏ' గ్రేడు సంపాదించుకుంది. తనకి కారు కొనిచ్చి వాళ్ళ నాన్న కూడా మాట నిలబెట్టుకున్నాడు. ఇది ఒక బహుమానమా? కానే కాదు. అది వాస్తవానికి తను చూపించిన ప్రతిభకి అమెది అందిన ఒక ప్రతిఫలం.

ఒక బహుమానం ఎప్పుడూ కూడా ఉచితంగా ఇవ్వబడాలి మరియు ఉచితంగా స్వీకరించబడాలి. మీరు దానికి చెల్లింపు చేసినా, లేదా తిరిగి దానికి బదులుగా ఇంకేదైనా చేసినా - ఇక అది ఎంతమాత్రమూ బహుమానంగా వుండదు.

పరలోకం (నిత్య జీవము) ఒక ఉచిత బహుమానమని బైబిల్ మనకు బోధిస్తోంది:

మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

ఎఫెసీయులకు 2:8-9

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము.

రోమీయులకు 6:23

పరలోకంలో స్థానం కొరకు ఎవరికీ అర్హత వుండదు. మరియు ఎవరూ ఆ స్థానాన్ని సంపాదించలేరు.

ఎందుకంటే...

2

మానవుడు ఒక పాపి.
తనను తాను కాపాడుకోలేడు.

*

ఆరు గ్రుడ్లు అవసరమయ్యే ఒక ఆమ్లెట్‌ని మీరు వేస్తున్నారనుకోండి. ఒక్కొక్క గుడ్డుని మీరు పగలగొట్టి వాటి సొనని పాత్రలో వేస్తారు. చివరి గుడ్డుని కూడా పగలగొట్టి అందులో వేస్తారు. కాని వెంటనే మీరు తల తిప్పుకొని ముక్కు పట్టుకుంటారు. ఎందుకంటే ఆ చివరి గుడ్డు కుళ్ళిపోయి వుంది.

ఆ మొత్తం మిశ్రమాన్ని పడేయడం తప్ప మీకు ఇంకొక దారి లేదు. అందులో మిగతా అయిదు గుడ్లు మంచిగానే వున్నా, ఒకే ఒక్క గుడ్డు మిగతా మొత్తాన్ని పాడు చేసేసింది.

మీరు ఎలా అయితే మీ కుటుంబానికి ఒక్క చెడిన గుడ్డుతో కలుషితమైన ఆమ్లెట్‌ని వడ్డించరో, అలాగే మనం కేవలం ఒక్క పాపం వలన కూడా కలుషితమైన జీవితాన్ని పరిశుద్ధ దేవుని వద్దకి తీసుకొని వెళ్ళి, దానిని ఆయన అంగీకరించాలని ఆశించచలేము.

దేవుని రీతి అతి ఉన్నతమైనది. ఆయన దృష్టిలో కోపం హత్యకు సమానము; ఒక కామపు ఆలోచన వ్యభిచారానికి సమానము. పాపము అంటే మనము చేసేది మాత్రమే కాదు, మనము ఆలోచించేదేదైనా, చెప్పేదేదైనా, చేసేదేదైనా లేదా దేవుని యొక్క పరిపూర్ణ రీతి యొక్క స్థాయికి ఉండని విధంగా చేసే ఏ పనైనా కూడా పాపమే అవుతుంది.

ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

రోమీయులకు 3:23

"కాని నేను మంచివాడిని," అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. "నేను నా కుటుంబంపై శ్రద్ధ వహిస్తాను. నా సంఘంలో ఉపకారం చేస్తాను. నేను దొంగిలించడం గాని ఎవరికైనా హాని చేయడం కాని చేయను. కాబట్టి, ఖచ్చితంగా నేను పరలోకంలోనికి అనుమతింపబడాలి కదా?"

మీరు మంచి జీవితాన్ని జీవించడం ద్వారా పరలోకంలోనికి ప్రవేశించాలనుకుంటే, ఇదిగో ఇంత మంచితనముగా వుండాలని ఏసుక్రీస్తు తెలియజేసాడు:

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

మత్తయి సువార్త 5:48

ఆలోచనలో మరియు క్రియలో పరిపూర్ణతే మనం పరలోకంలోనికి ప్రవేశించడానికి కావలసిన ప్రమాణము. సూటిగా చెప్పాలంటే, దేవుని స్థాయికి నీవు మంచివాడివై వుండాలి. ఈ స్థాయికి చేరడం ఒక మనిషికి అసాధ్యం.

అదే విధంగా, మంచి పనులు కూడా మనలని రక్షించలేవు, ఎందుకంటే...

3

దేవుడు ప్రేమస్వరూపి వాడు మరియు నీతిమంతుడు.

*

అన్నింటికీ తెగించిన ఒక వ్యక్తి ఒక బ్యాంకుని దోచుకోవాలని అనుకున్నాడనుకోండి. బ్యాంకు క్యాషియర్ దగ్గరికి వెళ్ళి, ఆమె వైపుకి తుపాకి గురిపెట్టి, డబ్బు ఇమ్మని గట్టిగా ఆదేశిస్తాడు.

భయపడిన క్యాషియర్ డబ్బులు ఇచ్చేస్తుంది.

అతను ఆ డబ్బుని తన సంచిలో పెట్టుకొని ద్వారం దగ్గరికి పరిగెడుతాడు. కాని మధ్యలో కార్పెట్ తట్టుకొని కింద పడిపోతాడు, తుపాకి కూడా చేజారిపోతుంది. వెంటనే బ్యాంకులోని భద్రతాధికారులు అతన్ని అదుపులోకి తీసుకుంటారు.

న్యాయస్థానంలో న్యాయమూర్తి అతన్ని ఈ విధంగా ప్రశ్నిస్తాడు, "ఏం చెప్పాలనుకుంటున్నావు?"

"తప్పు చేశాను," అంటాడు అతను నెమ్మదిగా. అతని దగ్గర ఇంకొక దారి లేదు. సాక్ష్యాలు కూడా అతనికి చాలా వ్యతిరేఖంగా వున్నాయి మరి.

"యువర్ ఆనర్," దొంగ చెప్పడం కొనసాగిస్తాడు, "ఇది నా మొదటి నేరం. నేను ఎవరినీ గాయపరచలేదు. బ్యాంకు వాళ్ళు తమ డబ్బంతా తిరిగి తీసుకున్నారు. దయచేసి నేను చేసిన దానికి నన్ను క్షమించి నన్ను వదిలేయగలరా?"

ఆ దొంగని గనుక విడుదల చేస్తే ఆ న్యాయమూర్తి నీతిమంతుడిగా ఉంటాడా? లేదు, అతను కాలేడు. ఆయన చట్టాన్ని అమలు చేయాలి. ఒక వ్యక్తి దొంగ అని నిరూపించబడితే, అతనిని శిక్షించమని ఆ చట్టం చెబుతోంది.

మానవుడిగా వున్న న్యాయమూర్తి కన్నా దేవుడు ఎంతో ఎక్కువ నీతిమంతుడు. ఆయన మన తప్పులని క్షమించబోడు, క్షమించలేడు.

...దేవుడు ప్రేమ స్వరూపి.

1 యోహాను 4:8

కాని నేను (దేవుడు) దోషులను క్షమించను.

నిర్గమకాండము 34:7

ఇక్కడే ఒక సందిగ్ధత: దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనలని శిక్షించాలనుకోడు. కాని దేవుడు నీతిమంతుడు కూడా, ఆయన మన పాపాన్ని శిక్షించాల్సిందే.

ఏసుక్రీస్తుని పంపించడం ద్వారా దేవుడు ఈ సందిగ్ధతని పరిష్కరించాడు.

4

ఏసు ప్రభువు దేవుడు మరియు మానవుడు కూడా.
ఆయన మన పాపాల కొరకు శిక్షించబడ్డాడు.

*

ఏసు ప్రభువు మానవ శరీరంలో వున్న దేవుడు. ఆయన మంచివాడు మాత్రమే కాదు, ఒక ప్రవక్త మరియు ఒక ఉపాధ్యాయుడు కూడా.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

యోహాను సువార్త 1:1,14

దేవుడు మనలని ప్రేమిస్తున్నాడు. కాని ఆయన మన పాపములను ద్వేషిస్తున్నాడు. ఆయన మనతో గాఢమైన బంధాన్ని కోరుకుంటున్నాడు. కాని ఆయనను మన నుండి వేరు చేసే గోడ మన పాపము మాత్రమే.

ఈ సమస్యని పరిష్కరించడానికి, దేవుడు మన భూత, వర్తమాన మరియు భవిష్యత్తుకి సంబంధించిన పాపలన్నింటినీ తీసుకొని వాటిని ఏసుపై ఉంచాడు. తరువాత, మన పాపముల కొరకు ఏసుని శిక్షించాడు.

మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను.

యెషయా 53:6

ఏసుక్రీస్తు క్రూరమైన మనుషులకి అప్పగించబడ్డాడు. వారు ఆయనిని కొట్టి అవమానపరిచారు. ఆయనని గుద్దారు, కొట్టారు, ఆయనపై ఉమ్మి వేశారు. కొరడాతో కొట్టినపుడు ఆయన చర్మం ఊడిపోయింది. ఆ కొరడా చివరన ఇనుప ముక్కలని అమర్చారు.

మనుషులు ఆయనని చూచి నవ్వుతుండగా, ఆయన తలపై ఒక ముళ్ళ కిరీటం ఉంచబడింది. తరువాత ఆయన చేతులకి మరియు పాదాలకి మేకులు దించబడ్డాయి. ఆయన శిలువకి మేకులతో అమర్చబడ్డాడు.

చివరగా, చివరి పాపము కొరకు ఏసు ప్రభువు పరిహారం చెల్లించిన తరువాత ఇలా అన్నాడు, "టెటలెస్టాయి." ఇదొక పురాతన వ్యాపార పదం, దీనర్థం: పరిహారం చెల్లించబడింది.

ఏసు ప్రభువు మరణించాడు. కాని మూడు రోజుల తరువాత దేవుడు ఆయనను మృతులలోనుండి పైకి లేపాడు.

దీనర్థం, మీయొక్క పాపములు ఇదివరకే శిక్షింపబడ్డాయి. అవి కేవలం మీయొక్క శరీరంలోనే శిక్షింపబడలేదు.

మన యొక్క పాపాలకి పరిహారం చెల్లించడానికి మరియు మనకి పరలోకంలో స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఏసు ప్రభువు శిలువపై చనిపోయి మృతులలోనుండి పైకి లేచాడు.

సబ్బు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలా అయితే మనం దానిని వాడినపుడు మాత్రమే అది మన శరీరాలను శుభ్రపరచగలుగుతుందో, అలాగే బహుమానం కూడా మనకి అందుబాటులో వుంటుంది, కాని మనం దానిని అంగీకరించినపుడు మాత్రమే అది మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

ఈ బహుమానం విశ్వాసం ద్వారా స్వీకరించబడుతుంది…

5

విశ్వాసం అనేది పరలోకం యొక్క
తలుపుని తెరిచే తాళం చెవి.

*

మీ జీవితాన్ని కాపాడే తాడు ఒక గోడపైనే వేలాడుతోంది.

నా బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవడానికి నేనొక పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి వుంటుంది. నేను ఎన్నో పాస్‌వర్డులు ఎంటర్ చేయగలను. కాని సరైన పాస్‌వర్డ్‌ మాత్రమే పని చేస్తుంది. రక్షించే విశ్వాసం మాత్రమే పరలోకానికి ద్వారం తెరిచే ఒక పాస్‌వర్డ్‌ అని చెప్పవచ్చు.

రక్షించే విశ్వాసం అంటే ఏమిటి?

ఒక శాస్త్రవేత్తకి నీటికి సంబంధించిన ఎన్నో నిజాలు తెలిసుండవచ్చు. కాని అతను ఒక ఎడారిలోంచి విపరీతమైన దాహంతో ఈడ్చుకుంటూ వెళుతున్న సమయంలో, అతని తలలో వున్న ఈ జ్ఞానం అతనిని కాపాడలేదు. అతను నీళ్ళు తాగాల్సిందే. కేవలం దేవుడున్నాడు అనే జ్ఞానం అనేది అతనిని రక్షించే విశ్వాసం కాదు.

ప్రయాణం మొదలుపెట్టే ముందు రక్షణ కొరకు మనం దేవుడిని ప్రార్థించవచ్చు లేదా పరీక్ష రాసేముందు మనం ఆయన సహాయాన్ని కోరవచ్చు. మనకు అవసరం వున్నపుడు లేదా కష్టంలో వున్నపుడు దేవుని వైపుకి మళ్ళడం అనేది తాత్కాలిక విశ్వాసం.

రక్షించే విశ్వాసం అంటే దేవుడు వున్నాడు అనే తల జ్ఞానం కాదు, తాత్కాలిక జ్ఞానం అంతకన్నా కాదు. నిజమైన రక్షించే విశ్వాసం అంటే ఏసు క్రీస్తుని మాత్రమే నిత్యజీవము కోసం విశ్వసించడం.

వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను.
అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పిరి.

అపొ. కార్యములు 16:30-31

మీరు ఒక పడవలో ప్రయాణిస్తున్నట్లుగా ఊహించుకోండి. అప్పుడు మీరొక భయంకరమైన తుఫానులో చిక్కుకున్నారు. పెద్ద పెద్ద అలలు ఎగసి వచ్చి మీ చిన్న పడవను పడేశాయి. అందులో ఒక అల మీ పడవని కూడా ముంచేసింది. మీరు కేవలం ఒక చెక్క ముక్కని పట్టుకొని ఆ చల్లని నీళ్ళలో పోరాడుతున్నారు.

ఒక ఓడ మిమ్మల్ని వెంటనే గమనించి మీ దగ్గరికి వచ్చేసింది. ఆ ఓడ యొక్క కెప్టెన్ ముందు భాగానికి వచ్చి ఇలా అరుస్తున్నాడు, "ఏయ్! మేం తాడు కట్టిన ట్యూబుని నీకోసం పడేస్తున్నాము. దాన్ని పట్టుకో! మేం నిన్ను సురక్షితంగా పైకి లాగుతాం."

ఇదే విధంగా, మనం పాపంలో మునిగిపోవడాన్ని దేవుడు చూస్తాడు. మనల్ని కాపాడుకునేంతటి శక్తి మనకు వుండదు. అప్పుడు ఆయన ఇలా అరుస్తాడు, "నేను నీకోసం నీ జీవితానని కాపాడే తాడుని పడేసి వున్నాను. అదెవరో కాదు, ఆయన ఏసు క్రీస్తు. ఆ చెక్క ముక్కని వదిలేయ్. ఆయనని పట్టుకో, నేను నిన్ను సురక్షితంగా బయటకి తీసుకొస్తాను."

మనం ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి: ఒకటి, ఆ చెక్కనే పట్టుకొని వుండటం (మనల్ని మనమే కాపాడుకోవడానికి ప్రయత్నించడం) లేదా రెండవది, దానిని వదిలిపెట్టి ఏసు ప్రభువు మనలని కాపాడతాడని విశ్వసించడం.

నిత్యజీవమునకు ఏసు ప్రభువు ఒక్కడే మార్గము. ఆయన దేవుడు పంపిన ఒకే ఒక్క జీవిత సంరక్షకుడు. నిత్య జీవమనే బహుమానం పొందడానికి మనం కేవలం ఏసు క్రీస్తులో మాత్రమే మన విశ్వాసాన్ని నిలపాలి.

ఇది మీకు అర్థవంతంగా అనిపిస్తుందా?

*

మీరు దీనిని అనుకోకుండా చదవడం లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు పాప క్షమాపణని అందించి ఆయన కుటుంబంలో చోటు ఇవ్వాలనుకుంటున్నాడు.

మీరు నిత్యజీవమనే బహుమతిని స్వీకరించాలనుకుంటున్నారా?

ఎటువంటి క్లిష్టమైన ఆచారం పాటించవలసిన అవసరం లేదు. కేవలం అడగడం ద్వారానే మీరు ఈ బహుమతిని పొందవచ్చు.

మీ యొక్క జవాబు అవును అనేదే అయితే, ఈ క్రింది ప్రార్థనని పలకండి:

ప్రియమైన ఏసు ప్రభువా. నేనొక పాపిని. నువ్వు ఇచ్చే నిత్య జీవమను బహుమతిని నేను స్వీకరించదలిచాను. నీవు దేవుని యొక్క కుమారుడివని విశ్వసిస్తున్నాను. నీవు నా పాపాల నిమిత్తము చనిపోయావని విశ్వసిస్తున్నాను. నీవు మృతులలోనుండి పైకి లేచావని విశ్వసిస్తున్నాను. నీలోనే నేను విశ్వాసం ఉంచడానికి ఎంచుకుంటున్నాను. నిత్య జీవమనే బహుమతి కొరకు నీకు నాయొక్క ధన్యవాదాలు ప్రభువా. ఆమెన్.

ఇప్పుడు మీరు చేసిన దాని గురించి ఏసు ప్రభువు ఈ విధంగా అన్నాడు:

నీకు నేను నిజము చెప్పెదను. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు.

యోహాను సువార్త 6:47

దీనర్థం ఏంటంటే మనం విశ్వసించిన మరుక్షణమే నిత్యజీవము పొందుతాము. ఎందుకంటే నీవు ఆయనని నమ్మావు గనుక, దానిని వెంటనే స్వీకరించావు.

తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛ వలన ఐనను పుట్టినవారు కారు.

యోహాను సువార్త 1:12-13

ఇప్పుడు నీవు దేవుని కుటుంబంలో ఒకరివి. నీవు చేసేదేదీ దానిని మార్చలేదు. ఒకసారి బిడ్డ పుట్టిన తరువాత, ఆమె లేదా అతని యొక్క పుట్టుక నశించడం జరగదు.

నీయొక్క భూత, వర్తమాన, మరియు భవిష్యత్తుకి సంబంధించిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దేవుని దృష్టిలో నీవు, నీవెప్పుడూ కూడా పరిశుద్దుడివి. ఏసు ప్రభువు మాదిరిగానే.

నీవు భయానికి ఇక ఎంత మాత్రమూ బానిసవి కాదు...

తన తండ్రి చేతులలో ఒక బాలుడు.

నీవు

దేవుని యొక్క కుమారుడివి.